aradhya

slide11 (1)
slide22
slider22
slider3-2-1
New-Project-1
previous arrow
next arrow

Welcome to Worldwide Aradhya Bandhus

శ్రౌత శైవం – శ్రౌత శైవ మతము/సిద్ధాంతం సనాతనధర్మంలో ప్రతిపాదించబడిన వేదం, శృతి, ఉపనిషత్తులు, ఆగమములు, పురాణములు, ఇతిహాసముల పట్ల పూర్తి భక్తి ప్రపత్తులు కలిగి ఉండి, మహాదేవుడైన ఆ సదాశివుని పూజిస్తూ, ఇతర దేవతలు , పూజా విధానాల పట్ల భక్తి భావము కలిగి ఉండే మతము.

లక్ష్యం – ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రౌత శైవ ఆరాధ్యులకు ఒక వెబ్ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడిన ఈ ప్రయత్నం లో మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ వెబ్ సైట్ ఆరాధ్య బంధువులను ఒక దగ్గర చేర్చటానికి మరియు సమాచారం అందించుకోడానికి మాత్రమే. ఇది మిగిలిన శ్రౌత శైవ ఆరాధ్య సమూహాలతో కలిసి పనిచేస్తుంది. వివిధ ప్రాంతాలలో ఉన్న శ్రౌత శైవ ఆరాధ్య బంధువుల వివరాలు, శైవ పీఠం సమాచారాలు, కార్యక్రమాలు అందచేయటమే మా ముఖ్య ఉద్దేశ్యం. భావి తరాలకు  స్ఫూర్తిని ఇచ్చే  ప్రముఖ ఆరాధ్య బంధువుల జీవిత చరిత్రలు, శైవ పీఠాధిపతుల గురించి, శ్రౌత శైవం గురించి యింకా అనేక వివరాలు మరియు ఎన్నో విషయాలు పొందుపరచటమే ఈ వెబ్ సైట్ ముఖ్య ఉద్దేశ్యం. శ్రౌత శైవ సంబంధిత వ్యాసాలు, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి పొంది, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తుల గురించిన వ్యాసాలు వ్రాసి పంపించదల్చుకున్న వారికి స్వాగతం. స్థానికంగా ఉన్న ఆరాధ్య బంధువులు తమ కార్యక్రమ వివరాలు లేదా తమ వివరాలు పొందు పరచగోరితే మాకు పంపించండి, ప్రచురించగలం.

గమనిక – ఈ వెబ్ సైట్ లో పొందుపరచబడిన సమాచారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరాధ్య బంధువుల కి సహాయ పడగలదు  అనే ఉద్దేశ్యంతో వివిధ సమూహాలు మరియు పుస్తకాల నించి సేకరించడమైనది. ఈ విషయమై ఏదన్నా అభ్యంతరాలు లేదా కాపీరైట్ చట్ట ఉల్లంఘన అని భావిస్తే admin@aradhya.org ని సంప్రదించిన తొలగించబడును. వెబ్ సైట్ లో ఉంచబడిన వ్యక్తిగత సమాచారం కేవలం సందేహ నివృత్తి లేదా సమాచారం కొరకు మాత్రమే. ఆరాధ్య సంబంధమైన కార్యక్రమాలు అన్నీ గురు/బ్రహ్మ ముఖంగా చేసుకోవలెను లేదా జరుపుకొనవలెను. ఈ షరతులకు లోబడి మాత్రమే ఈ వెబ్ సైట్ ఉపయోగించుకోగలరు. వెబ్ సైట్ లో ఉంచిన వ్యక్తిగత సేవలు, వ్యాపార సేవలకి సంబంధించిన లావాదేవిలకి వెబ్ సైట్ నిర్వాహకులు ఎట్టి బాధ్యత వహించరు మరియు వారికి యెట్టి  సంబంధములేదు

సేవలు

ఎందరో ఆరాధ్యులు వివిధ రంగాలలో తమ వృత్తి, వ్యాపారాల ద్వారా అమూల్యమైన సేవలు అందజేస్తున్నారు. మీ సేవలకి ఉచిత ప్రకటనలు కల్పించడమే మా ఉద్దేశ్యం. మీ సేవలకి సంబందించిన ప్రకటనలు (క్లుప్తంగా) మాకు పంపిస్తే ఈ వెబ్ సైట్ లో ఉంచగలము.

గమనిక: ఈ ప్రకటనల ద్వారా సేవలు అందిచే వారు, అందుకునే వారి మధ్య జరిగే లావాదేవీలకి వెబ్ సైట్ నిర్వాహకులకి ఎట్టి సంబంధము ఉండదు. అందుకు బాధ్యత వహించి ప్రకటనలు ఇవ్వగలరు మరియు సేవలు అందుకొనగలరు.

Services

Many aradhyas are providing services via small businesses, via entrepreneurships, Real estate and many more fields. If you can send a brief information about your services with a name and number we will keep that flier in the website under services for free. 

Note: Any services or agreements made through these advertisements are sole responsibility of the provider and service taker. Website or website admins will NOT bear or take any responsibility. Please make a note while providing your advertisement or taking services.

ఆసరా_ఆరాధ్య

మారిన మరియు మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులలో ఎన్నో ఆరాధ్య కుటుంబాలు కొన్ని అవసరాలకై యిబ్బందులు పడుతున్న సంగతి విదితమే. ఈ విషయమై ఎంతో కొంత చేయూత యివ్వడమే మా లక్ష్యం. కొన్ని షరతులకు లోబడి, పెద్దల మార్గదర్శకత్వంలో  ఈ ఆసరా పథకం అర్హులైన ఆరాధ్యులకు అందించాలనే మా ప్రయత్నం. ఈ క్రింది అవసరములకు ప్రధాన ప్రాధాన్యత యివ్వబడును. ఈ పథకం కింద సహాయం కోరువారు ఎవరైనా తగు సమాచారం అందించి, కనీసం ఇద్దరు స్థానిక శ్రౌత శైవ పెద్దల సిఫారసు తీసుకు రాగలరు. అలాగే మీకు తెలిసి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సంప్రదించగలరు. 

Upcoming Events

వరంగల్ వాస్తవ్యులు కైలాస వాసులు శివశ్రీ గణార్చన మల్లయ్య గారి మనవరాలు స్వర్గీయ ముదిగొండ నాగ శివకుమార్ గారి కుమార్తె శ్రీమతి ముదిగొండ రాజ చంద్రిక గారి YouTube channel for kids https://youtu.be/KRd7wonkvmk ‘బాల చంద్రిక ‘ (baala Chandrika) సినీనటులు శ్రీ తనికెళ్ళ భరణి గారి చే ప్రారంభించబడింది. ఇందులో పిల్లల animated కథలు ఇతర విషయాలు వెల్లడిస్తారు https://youtu.be/KRd7wonkvmk