aradhya

Aim

లక్ష్యం – ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రౌత శైవ ఆరాధ్యులకు ఒక వెబ్ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడిన ఈ ప్రయత్నం లో మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ వెబ్ సైట్ ఆరాధ్య బంధువులను ఒక దగ్గర చేర్చటానికి మరియు సమాచారం అందించుకోడానికి మాత్రమే. ఇది మిగిలిన శ్రౌత శైవ ఆరాధ్య సమూహాలతో కలిసి పనిచేస్తుంది. వివిధ ప్రాంతాలలో ఉన్న శ్రౌత శైవ ఆరాధ్య బంధువుల వివరాలు, శైవ పీఠం సమాచారాలు, కార్యక్రమాలు అందచేయటమే మా ముఖ్య ఉద్దేశ్యం. భావి తరాలకు  స్ఫూర్తిని ఇచ్చే  ప్రముఖ ఆరాధ్య బంధువుల జీవిత చరిత్రలు, శైవ పీఠాధిపతుల గురించి, శ్రౌత శైవం గురించి యింకా అనేక వివరాలు మరియు ఎన్నో విషయాలు పొందుపరచటమే ఈ వెబ్ సైట్ ముఖ్య ఉద్దేశ్యం. శ్రౌత శైవ సంబంధిత వ్యాసాలు, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి పొంది, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తుల గురించిన వ్యాసాలు వ్రాసి పంపించదల్చుకున్న వారికి స్వాగతం. స్థానికంగా ఉన్న ఆరాధ్య బంధువులు తమ కార్యక్రమ వివరాలు లేదా తమ వివరాలు పొందు పరచగోరితే మాకు పంపించండి, ప్రచురించగలం.

గమనిక – ఈ వెబ్ సైట్ లో పొందుపరచబడిన సమాచారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరాధ్య బంధువుల కి సహాయ పడగలదు  అనే ఉద్దేశ్యంతో వివిధ సమూహాలు మరియు పుస్తకాల నించి సేకరించడమైనది. ఈ విషయమై ఏదన్నా అభ్యంతరాలు లేదా కాపీరైట్ చట్ట ఉల్లంఘన అని భావిస్తే admin@aradhya.org లేదా  ayyavaru@gmail.com ని సంప్రదించిన తొలగించబడును. వెబ్ సైట్ లో ఉంచబడిన వ్యక్తిగత సమాచారం కేవలం సందేహ నివృత్తి లేదా సమాచారం కొరకు మాత్రమే. ఆరాధ్య సంబంధమైన కార్యక్రమాలు అన్నీ గురు/బ్రహ్మ ముఖంగా చేసుకోవలెను లేదా జరుపుకొనవలెను. ఈ షరతులకు లోబడి మాత్రమే ఈ వెబ్ సైట్ ఉపయోగించుకోగలరు. వెబ్ సైట్ లో ఉంచిన వ్యక్తిగత సేవలు, వ్యాపార సేవలకి సంబంధించిన లావాదేవిలకి వెబ్ సైట్ నిర్వాహకులు ఎట్టి బాధ్యత వహించరు మరియు వారికి యెట్టి  సంబంధములేదు

శ్రౌత శైవం – శ్రౌత శైవ మతము/సిద్ధాంతం సనాతనధర్మంలో ప్రతిపాదించబడిన వేదం, శృతి, ఉపనిషత్తులు, ఆగమములు, పురాణములు, ఇతిహాసముల పట్ల పూర్తి భక్తి ప్రపత్తులు కలిగి ఉండి, మహాదేవుడైన ఆ సదాశివుని పూజిస్తూ, ఇతర దేవతలు , పూజా విధానాల పట్ల పూర్తి భక్తి భావము కలిగి ఉండే మతము.

Achievements

వివిధరంగాలలో (విద్య, కళ, సంగీత, సాహిత్యం) కృషి చేస్తున్న మరియు విజయం సాధించిన/సాధిస్తున్న మన ఆరాధ్య బంధువుల స్ఫూర్తి దాయకమైన విజయ గాధలు యిక్కడ చూడగలరు. ముఖ్యంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులలో, మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తున్న యువ కెరటాల విజయ గాధలు .. మీరు సాధించిన, కృషి చేస్తున్న రంగాల గురించి, మీ గురించి పంపితే ప్రచురించబడిన గలము. మీ వ్యక్తిగత సోషల్ మీడియా లంకెలు కూడా పరవాలేదు.