ఆసరా_ఆరాధ్య
మారిన మరియు మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులలో ఎన్నో ఆరాధ్య కుటుంబాలు కొన్ని అవసరాలకై యిబ్బందులు పడుతున్న సంగతి విదితమే. ఈ విషయమై ఎంతో కొంత చేయూత యివ్వడమే మా లక్ష్యం. కొన్ని షరతులకు లోబడి, పెద్దల మార్గదర్శకత్వంలో ఈ ఆసరా పథకం అర్హులైన ఆరాధ్యులకు అందించాలనే మా ప్రయత్నం. ఈ క్రింది అవసరములకు ప్రధాన ప్రాధాన్యత యివ్వబడును. ఈ పథకం కింద సహాయం కోరువారు ఎవరైనా తగు సమాచారం అందించి, కనీసం ఇద్దరు స్థానిక శ్రౌత శైవ పెద్దల సిఫారసు తీసుకు రాగలరు. అలాగే మీకు తెలిసి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సంప్రదించగలరు.
- ఉపనయనం
- లింగధారణ
- ఉన్నత విద్య
- వైద్య సహాయం
- వివాహాది క్రతువులు (ఆరాధ్య సంబంధాలు కలుపుకునే వారికి మొదటి ప్రాధాన్యత)
- అంత్యేష్ఠి సంస్కారములు.
గమనిక: అన్ని వివరములు గోప్యంగా ఉంచబడును.