aradhya

ఎంతో మంది మహానుభావులు, ప్రాతఃస్మరణీయులు ఈ శ్రౌత శైవ ఆరాధ్య పరంపర  ని పునీతం చేశారు. సాధ్యమైనంత మేర అట్టి వారి గురించి మనం అందరం తెలుసుకుని, తలచుకుని, భావి తరాలకు వారి సేవలు గుర్తు చేసి ఈ శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయాన్ని ముందుకు తీసికెళ్ళే గురుతర కర్తవ్యం వారికి తెలియచేయడం మన ధర్మం. ముఖ్యంగా శ్రౌత శైవ సంప్రదాయానికి ఆద్యులయిన శ్రీ శ్రీ శ్రీ నీలకంఠారాధ్యులవారు ప్రాతఃస్మరణీయులు. వారి బోధలు ముందుకు తీసికెళ్ళి  శ్రీ శైవ పీఠానికి వన్నె తెచ్చి ఎంతో మందిని తమ బోధలతో సన్మార్గంలో నడిపించిన పూర్వ పీఠాధిపతులు, ప్రస్తుత పీఠాధిపతులు, ఉప పీఠాధిపతుల బోధలు, వారి జీవన యానం మనందరికీ ఎంతో ఉపయుక్తం కాగలదు. వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్ఠులు  అయిన ఆరాధ్యులు ఎందరో ఉన్నారు. వారి జీవిత చరిత్ర, వారి అనుభవాలు భావి తరాలకి మార్గ దర్శకత్వం వహిస్తాయి అనుటలో ఎంతమాత్రం సందేహం లేదు. వారి అందరి గురించి ఈ వేదికలో తెలియచెప్పడమే మా ముఖ్య ఉద్దేశ్యం. సామాజిక,  రాజకీయ, ఆర్ధిక, పరిపాలన, ఉపాధ్యాయ, వైద్య, విద్యా, న్యాయ, సంగీత, నాటక, కళా, ఉపన్యాస, ఆధ్యాత్మిక యింకా అనేక ఇతర రంగాలలో దేశ విదేశాలలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్న ఆరాధ్య బంధువుల గొప్పతనం అతి త్వరలో ఈ వేదిక లో వ్యాసాలుగా వస్తుంది.